బుధవారం 02 డిసెంబర్ 2020
Crime - Oct 28, 2020 , 15:50:40

కరెంట్‌ షాక్‌తో ట్రాక్టర్ డ్రైవర్ మృతి

కరెంట్‌ షాక్‌తో ట్రాక్టర్ డ్రైవర్ మృతి

వరంగల్ రూరల్ : విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని వర్ధన్నపేట పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణ సమీపంలోని కోనారెడ్డి చెరువు పక్కన ఉన్న మామిడి తోటలో కరెంట్ షాక్‌తో ట్రాక్టర్ డ్రైవర్ చెన్నూరు స్వామి (45) మృతి చెందాడు. మృతుడు పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.