శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Jul 16, 2020 , 13:21:25

రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీ.. ఇద్దరు మృతి

రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీ.. ఇద్దరు మృతి

బండా : ఉత్తర్‌ ప్రదేశ్‌లోని నారైనా కొత్వాలి ప్రాంతంలో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. వివరాలు.. కొత్వాలి ప్రాంతానికి చెందిన అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ రాజ్ బహదూర్ కుష్వాహా (39), లాలక్ సింగ్ (35) అనే వ్యక్తి బుధవారం సాయంత్రం వ్యక్తిగత పని నిమిత్తం ద్విచక్రవాహనాలపై బయటికెళ్లారు. రెండు వాహనాలు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు.  ఇద్దరికి హెల్మెట్‌ లేకుండా ప్రయాణం చేయడం వల్ల మృతిచెందారని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ నరేని గిరిరాజ్ సింగ్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo