e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home News Toddler Kills Mom | జూమ్‌ కాల్‌లో ఉన్న తల్లిని షూట్ చేసిన రెండేళ్ల పిల్లాడు.. తండ్రి అరెస్టు

Toddler Kills Mom | జూమ్‌ కాల్‌లో ఉన్న తల్లిని షూట్ చేసిన రెండేళ్ల పిల్లాడు.. తండ్రి అరెస్టు

ఆల్టమోంటే స్ప్రింగ్స్: ఆమె పేరు షమాయా లిన్. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఆమె ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం కరోనా భయంతో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటి నుంచే ఆమె పని చేస్తోంది. ఆఫీసు వాళ్లతో జూమ్‌ కాల్‌ మాట్లాడుతోంది. ఇంతలో ఆమె రెండేళ్ల కుమారుడు వెనగ్గా వచ్చాడు.

అతనికి ఒక బ్యాగులో లోడ్ చేసిన తుపాకీ దొరికింది. దాంతో తల్లిని షూట్ చేసేశాడు. జూమ్‌ కాల్‌లో షమాయా ముందుకు పడిపోవడం చూసిన సహోద్యోగి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. కానీ షమాయా అడ్రస్ ఆ ఉద్యోగినికి తెలియదు. ఆ తర్వాత కాసేపటికే షమాయా బాయ్‌ఫ్రెండ్, పిల్లల తండ్రి వియాండ్రే ఆవరీ కూడా పోలీసులకు ఫోన్ చేశాడు.

- Advertisement -

తాను ఇంటికొచ్చే సరికే షమాయా తన కంప్యూటర్‌ ముందు కుప్పకూలి ఉందని, చుట్టూ రక్తపు మడుగు ఉందని ఆవరీ చెప్పాడు. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే షమాయా మృతిచెందింది. ఈ కేసులో తుపాకీని నిర్లక్ష్యంగా బ్యాక్‌ప్యాక్‌లో వదిలేసినందుకు ఆవరీని పోలీసులు అరెస్టు చేశారు. అతను అలా వదిలేయడం వల్లే రెండేళ్ల పసివాడికి ఆ తుపాకీ దొరికిందని, అతను తల్లిని షూట్ చేశాడని పోలీసులు అంటున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement