నిషేధిత పొగాకు ఉత్ప‌త్తులు భారీగా స్వాధీనం

Oct 31, 2020 , 21:12:08

ఖమ్మం : నిషేధిత పొగాకు ఉత్ప‌త్తులను టాస్క్‌ఫోర్స్ సిబ్బంది భారీగా ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మం న‌గ‌రంలో చోటుచేసుకుంది. టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావుకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు  ఖమ్మం నగరంలోని మున్సిపాల్ కార్యాలయ సమీపంలో ఉంటున్న అలంపల్లి సతీష్‌ అనే వ్యక్తి వ‌ద్ద నిల్వ ఉంచిన నాలుగు బస్తాల నిషేధిత పోగాకు ఉత్పత్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందుతుడికి సరుకు ఎక్కడ నుండి వస్తుందో  సమాచారం సేకరించారు. దీంతో టాస్క్ ఫోర్స్ సీఐ వెంకటస్వామి, ఖమ్మం వన్‌టౌన్ సీఐ చిట్టిబాబు సహకారంతో నల్ల‌గొండ వెళ్లి ఓం ట్రేడర్స్  యజమాని పోలా లక్ష్మి నర్సయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఇతని వ‌ద్ద‌ నుండి 5 బస్తాల అంబర్ ప్యాకెట్లు, 6 బస్తాల నిషేధిత ఆర్ఆర్ పోగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకొని ఖమ్మం వన్ టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప‌ట్టుబ‌డ్డ మొత్తం పొగాకు ఉత్ప‌త్తుల మార్కెట్ విలువ రూ. 5,02,250గా స‌మాచారం. ఈ తనిఖీల్లో వన్‌టౌన్ ఎస్ఐ శ్రీనివాస్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ప్రసాద్, కానిస్టేబుళ్లు రామారావు, కళింగ రెడ్డి పాల్గొన్నారు.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD