ఆదివారం 24 జనవరి 2021
Crime - Oct 07, 2020 , 18:08:36

టిప్పర్ లారీ, ట్రాక్టర్ ఢీ..ఇద్దరు మృతి

టిప్పర్ లారీ, ట్రాక్టర్ ఢీ..ఇద్దరు మృతి

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీ  పరిధిలోని ..గొర్రె పేట వాగు వద్ద టిప్పర్ లారీ, ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. టిప్పర్ మణుగూరు నుంచి బొగ్గు లోడుతో వెళ్తుండగా.. ట్రాక్టర్ మణుగూరు నుంచి పినపాక వెళ్తున్నట్లు సమాచారం. రెండు వాహనాలు ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో పినపాకకు చెందిన వెంకన్న, కృష్ణారావు మృతి చెందినట్లు గుర్తించారు. వీరిద్దరూ స్థానిక బీటీపీఎస్‌లో కంపెనీలో పని చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo