శుక్రవారం 22 జనవరి 2021
Crime - Jan 09, 2021 , 18:14:28

బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్‌ వ్యక్తి మృతి .. ఇద్దరికి గాయాలు

బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్‌ వ్యక్తి మృతి .. ఇద్దరికి గాయాలు

సిద్దిపేట :  బైక్‌ను టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా గౌరారం మండలం  సింగాయిపల్లి క్రాస్ రోడ్డు వద్ద శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. హైదరాబాద్‌లోని మియాపూర్‌ ప్రాంతానికి చెందిన శ్రీరామ్‌, బాలాజీ, రాజు బైక్‌పై సిద్దిపేట వైపు వెళ్తున్నారు. సింగాయిపల్లి క్రాస్ రోడ్డు వద్దకు రాగానే టిప్పర్ ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావమై శ్రీరామ్ (32) ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. క్షతగాత్రులిద్దరినీ మెరుగైన చికిత్స కోసం గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo