మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jul 05, 2020 , 18:24:08

ఆవు, దూడలపై పెద్ద పులి దాడి

ఆవు, దూడలపై పెద్ద పులి దాడి

నాగర్‌కర్నూల్‌  : ఆవు, దూడలపై పెద్దపులి దాడి చేసిన సంఘటన జిల్లాలోని బల్మూరు మండలం అంబగిరి సమీపంలోని యాపర్ల చెరువు వద్ద చోటు చేసుకున్నది. గిరిజన రైతుల కథనం మేరకు..అంబగిరి గ్రామానికి చెందిన పలువురు రైతులు యాపర్ల చెరువు సమీపంలో దొడ్డి ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో పలువురికి చెందిన 50 పశువులను నిత్యం అక్కడే ఉంచుతారు. అయితే శనివారం అర్ధరాత్రి పశువుల దొడ్డిపై పెద్దపులి దాడి చేసింది.

ఆవు, దూడను చంపింది. మరో ఆవుపై దాడి చేయగా గాయపడింది. ఆదివారం ఉదయం రైతుల దొడ్డి వద్దకు రాగా గిరిజన రైతు వడ్త్య లాలు, బిల్లు నాయక్‌లకు చెందిన దూడ మృతి చెంది ఉండగా.. ఆవు జాడ కనిపించడం లేదు. మరో ఆవు గాయపడింది. దొడ్డి సమీపంలో పెద్దపులి పాదాల గుర్తులను గుర్తించారు. అటవీ శాఖాధికారులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 


logo