శనివారం 08 ఆగస్టు 2020
Crime - Aug 02, 2020 , 13:51:58

టిక్ టాక్ సింగర్ బలవన్మరణం

టిక్ టాక్ సింగర్ బలవన్మరణం

హైదరాబాద్ : టిక్ టాక్ సింగర్ రాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా కోడూరు మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన రాజు టిక్ టాక్ ద్వారా సింగర్ గా గుర్తింపు పొందాడు. 'అక్క రాఖీతో ఇంటికి వస్తే ఇక లేడని ఇక రాడని చెప్పమ్మ' అనే పాటపాడిన రాజు సోషల్‌ మీడియా లో ఫేమస్ అయ్యాడు. అటువంటి గాయకుడు రాజు రాఖీ పండుగ ముందు రోజున ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో విషాదం నెలకొన్నది. టిక్ టాక్ లో రాజుకు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


logo