ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 19, 2020 , 12:07:52

ప్రమాదవశాత్తు యమునా నదిలో మునిగి ముగ్గురు యువకులు మృతి

ప్రమాదవశాత్తు యమునా నదిలో మునిగి ముగ్గురు యువకులు మృతి

షామ్లీ : ఉత్తర్‌ప్రదేశ్‌రాష్ర్టం షామ్లీలోని యమునా నదిలో ముగ్గురు యువకులు మునిగి చనిపోయారు. నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగి చనిపోయినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు ఆదివారం తెలిపారు. కైరానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉత్తర ప్రదేశ్-హర్యానా సరిహద్దులోని యమునా వంతెన సమీపంలో నదిలో స్నానం చేస్తున్న సమయంలో యువకులు మునిగిపోయారని తెలిపారు. మృతులకు సుమారు 16 నుంచి 19 ఏండ్ల మధ్యలో వయస్సు ఉంటుందని మృతులు హర్యానా నుంచి వచ్చినట్లు తెలుస్తోందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు, స్థానిక మత్స్యకారుల సాయంతో మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు సర్కిల్ ఆఫీసర్ ప్రదీప్ సింగ్ తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo