శనివారం 23 జనవరి 2021
Crime - Dec 07, 2020 , 12:52:05

మైనర్‌పై ముగ్గురు యువకుల లైంగిక దాడి..బాలిక మృతి

మైనర్‌పై ముగ్గురు యువకుల లైంగిక దాడి..బాలిక మృతి

వరంగల్ రూరల్ : జిల్లాలోని దుగ్గొండి మండలం రేపల్లెలో దారుణం చోటు చేసుకుంది. లైంగిక దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. 14 ఏండ్ల బాలికపై కొంత కాలంగా ముగ్గురు యువకులు లైంగిక దాడి చేశారు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. గర్భం తీసేందుకు బాలికకు యువకులు గర్భస్రావం మాత్రలు ఇవ్వగా తీవ్ర రక్తస్రావంతో వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. 

ఈ నేపథ్యంలో పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట‌్లు తెలిసింది. గత నెల 26న జరిగిన ఈ ఘట‌న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లైంగిక దాడి చేసిన ముగ్గురు యువకులు బాలికతో సన్నిహితంగా ఉండే వారేనని సమాచారం.


logo