గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Sep 03, 2020 , 19:59:41

పాతకక్షే పాప ప్రాణం తీసిందా.!

పాతకక్షే పాప ప్రాణం తీసిందా.!

లఖింపూర్‌ : ఇంటిముందు ఆడుకుంటున్న మూడేళ్ల బాలిక అదృశ్యమై గ్రామశివారులోని చెరుకు తోటలో శవమై కనిపించింది. తలపై బలమైన గాయాలుండటంతో హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్‌ జిల్లాలో సింగాహి గ్రామంలో మూడేళ్ల బాలిక బుధవారం అదృశ్యమైంది. గురువారం ఉదయం శివారులోని చెరుకు తోటలో పోలీసులు పాప మృతదేహాన్ని గుర్తించారు. స్థానిక లెఖ్రామ్ కుటుంబానికి చెందిన వ్యక్తులతో తనకు పాత కక్షలున్నాయని, వారే పాపను అపహరించి హత్య చేసి ఉంటారని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడని  లఖింపూర్ ఖేరి పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) సతేంద్ర కుమార్ సింగ్ తెలిపారు.  మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపినట్లు వెల్లడించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వస్తే కేసులో మరింత పురోగతి వస్తుందని ఎస్పీ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo