శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jul 19, 2020 , 10:22:53

రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి

రోడ్డుప్రమాదంలో  ముగ్గురు మృతి

అనంతపురం: జిల్లాలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. గుత్తి మండలం జక్కల చెరువు వద్ద వివాహానికి వెళ్తున్న కారును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న  ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటనలో మరో ముగ్గురికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.  కర్నూలు నుంచి కొండాపురం గ్రామానికి వెళ్తుండగా ఈసంఘటన చోటు చేసుకుంది. మృతులంతా కొండాపురం గ్రామస్తులని పోలీసులు పేర్కొన్నారు. 


logo