Crime
- Nov 21, 2020 , 17:58:03
మూడు వేల క్వింటాళ్ల పత్తి దగ్ధం

సూర్యాపేట : జిల్లాలోని తిరుమలగిరిలో మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం గ్రామ శివారులో సంతోషిమాత కాటన్ మిల్లులో ప్రమాదవశాత్తు మూడు వేల క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. పత్తిమిల్లు యాజమాన్యం ఈ పత్తి సీజన్లో సుమారు మూడు వేల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. శనివారం పత్తి కొనుగోలు చేసి ట్రాక్టర్ సహాయంతో పత్తి కుప్పలో దిగుమతి చేస్తుండగా ట్రాక్టర్ ఇంజన్ ఆగిపోవడంతో డ్రైవర్ కిందకు దిగి డైనమా వైర్లు కలిపి ట్రాక్టర్ను స్టార్ట్ చేస్తున్న క్రమంలో మెరుగులు పత్తిలో పడి మంటలు వ్యాపించాయి. అక్కడే ఉన్న వారు నీళ్లు చల్లి చల్లార్చే ప్రయత్నం చేసిన ఫలించకపోవడంతో సూర్యాపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పత్తి నష్టం సుమారు కోటి రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం.
తాజావార్తలు
- జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు
- స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ రూ.1000 కోట్లు
- హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?
- చిరంజీవితో మరోసారి జతకడుతున్న నయనతార?
- కళ్ల కింద నల్లటి వలయాలా? ఇవి తినండి
- సిన్సినాటి డెమోక్రాట్ మేయర్ అభ్యర్థిగా ఇండో అమెరికన్
- ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
- పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్
- తొలి రోజు సక్సెస్.. 1.91 లక్షల మందికి కరోనా టీకా
MOST READ
TRENDING