శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Aug 12, 2020 , 17:30:51

ఉగ్రవాదులకు నిధులు చేరవేస్తున్న ముగ్గురు అరెస్ట్

ఉగ్రవాదులకు నిధులు చేరవేస్తున్న ముగ్గురు అరెస్ట్

శ్రీనగర్: ఉగ్రవాదులకు నిధులు చేరవేస్తున్న ముగ్గురిని జమ్ముకశ్మీర్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్న ఈ ముగ్గురు ఉత్తర కశ్మీర్ జిల్లాల్లోని ఉగ్రవాద సంస్థలతో పనిచేస్తూ నిధులను చేరవేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఉగ్రవాద సంస్థలకు ఎక్కడి నుంచి నిధులు అందుతున్నాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

logo