గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Sep 09, 2020 , 16:17:33

గ‌డ్డి కోసం పొలానికి వెళ్లిన బాలిక‌ను ఎత్తుకొచ్చి.. కాళ్లు చేతులు క‌ట్టేసి..

గ‌డ్డి కోసం పొలానికి వెళ్లిన బాలిక‌ను ఎత్తుకొచ్చి.. కాళ్లు చేతులు క‌ట్టేసి..

గ‌ర్హ్వా : మైన‌ర్‌పై ముగ్గురు యువ‌కులు సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న జార్ఖండ్ రాష్ర్టంలోని గ‌ర్హ్వా జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాలు.. విజున్‌పురా గ్రామానికి చెందిన బాలిక ఈ నెల 5న  సాయంత్రం ప‌శువుల కోసం గ‌డ్డి తేవ‌డానికిక‌ని పొలానికి వెళ్లింది. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన రితేశ్‌ సింగ్ అలియాస్ రీతు సింగ్ త‌న ఇద్ద‌రు స్నేహితుల‌తో క‌లిసి బాలిక‌ను బ‌ల‌వంతంగా స‌మీపంలోని అడ‌విలోకి ఎత్తుకెళ్లాడు. ఆమె కాళ్లు, చేతుల‌ను చున్నీతో క‌ట్టేసి ముగ్గురూ సామూహిక లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. 

అదే రోజు రాత్రి బాలిక‌ను రీతుసింగ్ త‌మ ఇంట్లోనే ఓ గ‌దిలో ఉంచి తాళం వేశాడు. ఉదయం నిందితుడి తాత బాధితురాలి ఇంటికి వెళ్లి, మీ కుమార్తె మా ఇంట్లో బంధించి ఉంద‌ని చెప్ప‌డంతో బాలిక తండ్రి వ‌చ్చి ఆమెను విడిపించాడు. త‌రువాత జ‌రిగిన విష‌యాన్ని బాలిక తండ్రికి తెలియ‌ప‌ర్చగా ఆయ‌న పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేశామ‌ని, ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మైన‌ర్ నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నామ‌ని స్టేషన్ ఇన్‌చార్జి చున్వా ఓరాన్ మంగ‌ళ‌వారం తెలిపారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo