బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Sep 15, 2020 , 20:17:18

ప్రియురాలిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి.. స్నేహితులతో కలిసి..

ప్రియురాలిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి.. స్నేహితులతో కలిసి..

మీరట్‌ : ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో లైంగికదాడి ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మీరట్‌లో ఓ మహిళపై ప్రేమికుడితో పాటు ఇద్దరు స్నేహితులు లైంగికదాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. 

వివరాలు మీరట్‌కు చెందిన ఓ మహిళ ప్రైవేట్‌ దవాఖానలో పని చేస్తుంది. సోమవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా.. ఆమె ప్రియుడు ఫోన్‌ చేసి తానున్న చోటుకు రావాల్సిందిగా కోరాడు. సరేనని మహిళ అక్కడికి వెళ్లిన తరువాత ప్రియుడితో పాటు అతడి ఇద్దరు స్నేహితులు కలిసి ఆమెను కారులో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లారు. మొదట ప్రియుడు ఆమెపై లైంగికదాడికి పాల్పడగా తరువాత స్నేహితులు కూడా వరుసగా ఆమెను కారులోనే రేప్‌ చేశారు.  

ఘటన తరువాత మంగళవారం యువతి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి, కారును సీజ్‌ చేసినట్లు మీరట్ ఎస్‌ఎస్పీ అజయ్ సాహ్ని తెలిపారు. పోలీసులు ప్రతి కోణం నుంచి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo