శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 14, 2020 , 14:48:13

హుండీ దోపిడీకి వ‌చ్చి పూజారుల హ‌త్య‌.. ఐదుగురు అరెస్ట్‌

హుండీ దోపిడీకి వ‌చ్చి పూజారుల హ‌త్య‌.. ఐదుగురు అరెస్ట్‌

మాండ్య‌ : కర్ణాటక రాష్ర్టం మాండ్య‌‌ జిల్లాలోని ఓ గ్రామంలో గ‌ల అర్కేశ్వర స్వామి ఆలయంలో హుండీ దోపిడీకి వ‌చ్చిన  దుండ‌గులు ముగ్గురు పూజారులను హత్య చేశారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. మాండ్యా బ‌స్‌స్టాప్ నుంచి ముగ్గురు నిందితులు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కాల్పులు జ‌రిపి అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులు మంజు, విజయ్, చంద్రు కాళ్ల‌కు బుల్లెట్ త‌గుల‌డంతో చికిత్స నిమిత్తం మాండ్య ప్ర‌భుత్వ ద‌వాఖాన‌కు త‌ర‌లించిన‌ట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో ఒక ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా గాయ‌ప‌డ్డారు. 

సెప్టెంబర్ 10న అర్థ‌రాత్రి ఆల‌య పూజారులు గణేశ్‌, ప్రకాశ్‌, ఆనంద్‌ల‌ను ఐదుగురు నిందితులు హ‌త్య చేసి హుండీ నుంచి న‌గ‌దు దోచుకెళ్లారు. ఈ కేసులో ఆదివారం సాయంత్రం ఇద్ద‌రిని అరెస్టు చేయ‌గా.. మిగిలిన ముగ్గురిని సోమ‌వారం అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo