శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Crime - Jan 22, 2021 , 14:48:21

రుణ యాప్‌ల కేసులో మరో ముగ్గురు అరెస్టు

రుణ యాప్‌ల కేసులో మరో ముగ్గురు అరెస్టు

హైదరాబాద్‌ : సంచలనం సృష్టిస్తోన్న రుణ యాప్‌ల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. రుణయాప్‌ల నిర్వాహకుల వేధింపులు తాళలేక రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గుండ్ల పోచంపల్లి గ్రామంలో 15 రోజుల క్రితం వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితు కుటుంబ సభ్యుల ఫిర్యాదు రంగంలోకి దిగిన పోలీసులు ఢిల్లీలో ముగ్గురిని అరెస్టు చేసి ఇక్కడికి తీసుకువచ్చారు.

రుణ యాప్‌ల నిర్వాహకుల ఆగడాలకు రాష్ట్రంలో ఇప్పటికే ఆరుగురు చనిపోయారు. రుణ యాప్‌ కాల్‌సెంటర్ల వేధింపులతో చాలాచోట్ల రుణ గ్రహీతలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రుణ యాప్‌లను 90 శాతం చైనా వారే నడుపుతున్నట్లు తెలుస్తున్నది. రుణ గ్రహీతలు ఇబ్బంది పడొద్దని, వేధింపుల బారినపడిన వారు 100కు డయల్‌ చేసి వివరాలు అందజేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo