బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jun 19, 2020 , 17:53:18

హత్య ఘటనలో ఒకరు.. ఆత్మహత్య చేసుకుని దంపతులు

హత్య ఘటనలో ఒకరు.. ఆత్మహత్య చేసుకుని దంపతులు

హైదరాబాద్‌ : వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ పరిధి మైసమ్మ గుట్ట వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మన్సూరాబాద్‌కు చెందిన సైదులును ఎల్‌బీనగర్‌వాసి యాదగిరి హత్య చేశాడు. హత్య అనంతరం నిందితుడు ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. మరొక ఘటనలో హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో గల పటేల్‌నగర్‌లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతో ఇంట్లో ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.


logo