మంగళవారం 26 మే 2020
Crime - May 23, 2020 , 12:23:14

వేర్వేరు దుర్ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు మృతి

వేర్వేరు దుర్ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు మృతి

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మెదక్‌ జిల్లా రాయాయంపేటలో రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అదేవిధంగా జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో ఈ తెల్లవారుజామున 3 గంటలకు కంచరి శివకుమార్‌ (28) అనే యువకుడు టిన్నర్‌ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వారం రోజులక్రితం తల్లి కరెంట్‌ షాక్‌తో చనిపోవడంతో తట్టుకోలేక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం గూడపూర్‌ గ్రామం వద్ద బైక్‌ అదుపుతప్పి కిందపడింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని మునుగోడు నివాసి యేరుకొండ సైదులుగా గుర్తించారు.


logo