మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jul 04, 2020 , 19:28:31

స్వాదాద్రి రియల్‌ ఎస్టేట్‌ స్కాంలో ముగ్గురు అరెస్టు

స్వాదాద్రి రియల్‌ ఎస్టేట్‌ స్కాంలో ముగ్గురు అరెస్టు

హైదరాబాద్‌ : స్వాదాద్రి రియల్‌ ఎస్టేట్‌ స్కాంలో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. నగరంలోని మాదాపూర్‌లో అధికవడ్డీ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. యార్లగడ్డ రఘుబాబు పలువురు వ్యక్తుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి అనంతరం పరారైయ్యాడు. బాధితులు మాదాపూర్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు యార్లగడ్డ రఘుబాబు, శ్రీనివాస్‌, మీనాక్షీలను అరెస్టు చేశారు. సీపీ సజ్జనార్‌ వివరాలను వెల్లడిస్తూ.. స్వాదాత్రి రియల్‌ఎస్టేట్‌ నిందితుడు మోసానికి పాల్పడట్లు తెలిపారు.

వివిధ స్కీంల పేరుతో మొత్తం 1450 మంది నుంచి రూ. 156 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. స్థలాల పేరుతో 300 మంది నుంచి రూ.42 కోట్లు, ఇళ్ల పేరుతో 200 మంది నుంచి రూ. 27 కోట్లు, అదేవిధంగా అధిక వడ్డీల పేరుతో 950 మంది నుంచి రూ.87 కోట్లు వసూలు చేశారన్నారు. పెద్ద పెద్ద ఫంక్షన్స్‌, మోటివేషన్‌ క్లాసులు పెట్టి ప్రజలను నమ్మించేవారన్నారు.


logo