సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Jul 26, 2020 , 08:01:35

క‌రోనా భ‌యంతో భార్యాబిడ్డ‌లను‌ చంపి ఆత్మ‌హ‌త్య‌‌!

క‌రోనా భ‌యంతో భార్యాబిడ్డ‌లను‌ చంపి ఆత్మ‌హ‌త్య‌‌!

బెంగ‌ళూరు: క‌ర్ణాటక రాష్ట్రం ధ‌న్వాడ్ జిల్లా కేంద్రంలో శ‌నివారం రాత్రి హృద‌య‌విదార‌క ఘ‌ట‌న చోటుచేసుకుంది. క‌రోనా భ‌యంతో ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయ‌ని, ఏదో ఒక‌రోజు త‌న ఉద్యోగం పోతుందని, అప్పుడు బ‌తుకు భారమ‌వ‌డం ఖాయ‌మ‌ని ఆందోళన చెందిన ఓ వ్య‌క్తి భార్యకు, బిడ్డ‌కు విష‌మిచ్చి చంపి.. అనంత‌రం తానూ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ మేర‌కు అత‌ను రాసిపెట్టుకున్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌డ‌గ్ జిల్లా రోనా తాలూకా అసూటీ గ్రామానికి చెందిన మౌనేష్ ప‌టారా (36) ఐదేండ్ల క్రితం అర్పిత (28)ను వివాహం చేసుకున్నాడు. వారికి శుక్రిత అనే నాలుగేండ్ల పాప ఉన్న‌ది. అయితే, ఈ కుటుంబం కొన్నేండ్ల క్రితం బ‌తుకుదెరువు కోసం ధ‌న్వాడ్‌కు మ‌కాం మార్చింది. మౌనేష్ ఓ ప్రైవేటు కంపెనీలో ప‌నిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నేప‌థ్యంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌బ‌ల‌డంతో మౌనేష్ త‌ర‌చూ ఆందోళ‌న‌కు గురయ్యేవాడు.

ఇంత‌లో ఇటీవ‌ల భార్య అర్పిత అస్వ‌స్థ‌త‌కు గురైంది. ఆస్ప‌త్రికి తీసుకెళ్తే బీపీ డౌన్ అయింద‌ని చెప్పి మందులు ఇచ్చి పంపారు. ఆ త‌ర్వాత బిడ్డ శుక్రిత‌కు జ్వ‌రం వ‌చ్చింది. వైద్యుల సూచ‌న మేర‌కు నాలుగు రోజులుగా మందులు వాడుతున్నా ఆ జ్వ‌రం త‌గ్గ‌డంలేదు. అటు అత‌ను చేస్తున్న ప్రైవేటు ఉద్యోగం కూడా ఎప్పుడు పోతుందో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో మ‌రింత ఆందోళ‌న‌కు గురైన మౌనేష్ దారుణానికి ఒడిగ‌ట్టాడు. కాగా, ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo