శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jun 29, 2020 , 16:08:04

ఆస్ప‌త్రికెళ్ల‌కుండా.. ఆవు పేడ‌లో పూడ్చి పెట్టారు.. ఇద్ద‌రు మృతి

ఆస్ప‌త్రికెళ్ల‌కుండా.. ఆవు పేడ‌లో పూడ్చి పెట్టారు.. ఇద్ద‌రు మృతి

రాయ్ పూర్ : పిడుగుపాటుకు గాయ‌ప‌డ్డ ఓ ముగ్గురు వ్య‌క్తుల‌ను ప్రాణాల‌తో కాపాడేందుకు ఆవు పేడ‌లో పూడ్చి పెట్టారు. కానీ ఆ ప్ర‌యోగం వికటించ‌డంతో.. ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, మ‌రొక‌రు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని జాష్పూర్ జిల్లాలో సోమ‌వారం చోటు చేసుకుంది. 

బాగ్ బ‌హ‌ర్ గ్రామానికి చెందిన ముగ్గురు.. వారి పంట పొలాల్లో ప‌నులు చేసుకుంటున్నారు. ఆ స‌మ‌యంలో మెరుపులు, ఉరుముల‌తో కూడిన వ‌ర్షం ప‌డింది. దీంతో ఆ ముగ్గురు క‌లిసి ఓ చెట్టు కింద‌కు వెళ్లారు. వారు పిడుగుపాటుకు గుర‌వ‌డంతో.. తీవ్ర గాయాల‌య్యాయి. 

ఈ ముగ్గురిని ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌లేదు. మెరుపు కార‌ణంగా గాయాలైతే.. అవి ఆవు పేడ‌కు త‌గ్గిపోతాయ‌ని ఆ గ్రామ‌స్తుల న‌మ్మ‌కం. దీంతో ముగ్గురిని ఆవుపేడ‌లో త‌ల వ‌ర‌కు పూడ్చి పెట్టారు. కాలిన గాయాలు ఆవు పేడ‌కు మానుతాయ‌నేది ఆ గ్రామ‌స్తుల మూఢ‌న‌మ్మ‌కం. కానీ అదేమీ జ‌ర‌గ‌లేదు. ప‌క్క గ్రామ‌స్తుల‌కు విష‌యం తెలియ‌డంతో.. వారు క‌ల్పించుకుని ఆ ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే సునీల్ సాయి(22), చంపా రౌత్(20) మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. మ‌రొక‌రు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. మృతుల కుటుంబాల‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇస్తామ‌ని అధికారులు తెలిపారు. మూఢ‌న‌మ్మ‌కాల‌ను న‌మ్ముకుని ఇద్ద‌రి ప్రాణాల‌కు గ్రామ‌స్తులు కార‌కుల‌య్యారు. 


logo