ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Jun 17, 2020 , 16:21:20

రూ. 3 లక్షల విలువైన గుట్కా పట్టివేత

రూ. 3 లక్షల విలువైన గుట్కా పట్టివేత

సిద్దిపేట : ప్రభుత్వం నిషేదించిన గుట్కా, అంబర్‌ ప్యాకెట్లను అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన సిద్దిపేటలో నేడు చోటుచేసుకుంది. పట్టుబడ్డ గుట్కా ప్యాకెట్ల విలువ రూ. 3 లక్షలుగా సమాచారం. బీదర్‌ నుంచి టేకుమట్లకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గుట్కాను సీజ్‌ చేసిన పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు.logo