బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jul 24, 2020 , 19:11:10

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

సూర్యాపేట : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన  కారు ఆపి సేదతీరు కుటుంబాన్ని మరో కారు మృత్యు రూపంలో దూసుకొచ్చి వెనక నుంచి  ఢీకొట్టడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని  కృష్ణాజిల్లా కృత్తివెలు మండలం ఇంటేరు గ్రామానికి చెందిన వడుగు నాగమల్లేశ్వరరావు (40)  అతని భార్య మామూలమ్మ (34) కూతురు దుర్గ (12) కొడుకు కొండబాబు హైదరాబాద్ లో రోజు వారి కూలీగా పనిచేస్తుంటారు.

నాగమల్లేశ్వరరావు హైదరాబాద్ లో కారుని కిరాయికి తీసుకొని విజయవాడకి వెళ్లి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వస్తున్నారు. మార్గమధ్యంలో మునగాల మండల పరిధిలోని మొద్దుల చెరువు సమీపాన  వాంతులు అవుతున్నాయని నలుగురు కారు దిగి రోడ్డు పక్కన నిల్చున్నారు. డ్రైవర్ కారులోనే ఉన్నాడు. అప్పుడే  వెనకాల నుంచి వచ్చిన కారు వారిని  ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కొండబాబుకు గాయాలు అవడంతో దవాఖానకు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. logo