మంగళవారం 04 ఆగస్టు 2020
Crime - Jul 12, 2020 , 14:44:32

ఆటోను ఢీకొన్న లారీ ముగ్గురు మృతి

ఆటోను ఢీకొన్న లారీ ముగ్గురు మృతి

అనంతపురం : ఆటోను లారీ ఢీకొట్టి ముగ్గురు మృత్యువాత పడ్డ ఘటన అనంతపురం జిల్లా బత్తలపల్లి మండల కేంద్రం సమీపంలో చోటు చేసుకుంది. తాడిమర్రి మండలం పిన్నదరికి చెందిన వారు తమ చేనులో పండిన బొప్పాయి పళ్లను ఆటోలో వేసుకొని మార్కెట్లో అమ్మెందుకు బత్తలపల్లికి బయలుదేరారు. బత్తలపల్లి సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న సూరి, ఆదమ్మ దంపతులు, చెన్నకేశవ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను బత్తలపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo