బుధవారం 27 జనవరి 2021
Crime - Dec 10, 2020 , 07:03:07

జగ్గయ్యపేటలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఖమ్మం వాసుల మృతి

జగ్గయ్యపేటలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఖమ్మం వాసుల మృతి

ఖమ్మం: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం గరికపాడు ఫ్లైఓవర్‌పై ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మగ్గురు చిన్నారులు సహా మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులు ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఆత్కూర్‌ వాసులుగా గుర్తించారు. 

వేములవాడ నుంచి వస్తున్న కారు ఇవాళ తెల్లవారుజామున గరికపాడు ఫ్లైఓవర్‌పై ఆగివున్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మాచర్ల శ్యామ్‌ (60), శారద (55), శ్యామల (38) అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ సైదులుతోపాటు భాగ్యలక్ష్మి, నవీన్‌, మాన్యశ్రీ (7), గోపీ (8), అక్షయ్‌ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ప్రమాద సయంలో కారులో ఎనిమిది మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగయ్యపేట ప్రభుత్వ దవాఖానకు తరలించగా, మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను ఖమ్మం దవాఖానకు తీసుకెళ్లారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


logo