శనివారం 31 అక్టోబర్ 2020
Crime - Sep 25, 2020 , 18:52:40

హాస్ట‌ల్ ప్రాంగ‌ణంలో విందు.. ముగ్గురు వార్డెన్లు స‌స్పెండ్‌

హాస్ట‌ల్ ప్రాంగ‌ణంలో విందు.. ముగ్గురు వార్డెన్లు స‌స్పెండ్‌

మంచిర్యాల : ప‌్ర‌భుత్వ హాస్ట‌ల్ ప్రాంగ‌ణంలో పార్టీ చేసుకున్నందుకు, అదేవిధంగా వీరి చ‌ర్య‌ల‌తో గిరిజ‌న సంక్షేమ‌శాఖ‌కు అప‌ఖ్యాతిని తెచ్చినందుకు ఉన్న‌తాధికారులు చ‌ర్య‌లు తీసుకుంటూ ముగ్గురి వార్డెన్స్‌పై స‌స్పెష‌న్ వేటు వేశారు. ఈ ఘ‌ట‌న మంచిర్యాల‌లో చోటుచేసుకుంది. ఐటీడీఏ-ఉట్నూర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ భావేష్ మిశ్రా ఈ మేర‌కు శుక్రవారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. వార్డెన్లు లక్ష్మణ్, మీనా రెడ్డి, మల్లా రెడ్డి స‌స్పెండ్ అయ్యారు. సెప్టెంబర్ 11 సాయంత్రం జిల్లా కేంద్రంలో ఉన్నహాస్ట‌ల్‌కు చెందిన వార్డెన్ లక్ష్మణ్ అతని సహచరులు మీనా రెడ్డి, మల్లా రెడ్డి ముగ్గురు కలిసి ఒకచోట చేరి మద్యం సేవించారని ఆరోప‌ణ‌లు. అదేవిధంగా వీరికి వంట చేసేందుకు మ‌హిళా స్వీపర్‌ను ఉపయోగించుకున్నారు. కాగా స్వీపర్ స్వ‌ప్న‌(30) అదే రోజు రాత్రి త‌న సంబంధికుడితో త‌లెత్తిన వివాదం నేప‌థ్యంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై ప్రాజెక్టు ఆఫిస‌ర్‌ భవేష్ మిశ్రా ఆరా తీశారు. సెప్టెంబర్ 17 న హాస్టల్‌ను పరిశీలించారు. నివేదిక‌ను  గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌కు సమర్పించారు.