శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 14, 2020 , 20:06:21

పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు ప్రభుత్వోద్యోగులు దుర్మరణం

పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు ప్రభుత్వోద్యోగులు దుర్మరణం

భీమవరం : కారు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లి పల్టీకొట్టడంతో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు దుర్మరణం చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శివారులో ఆంధ్రా షుగర్స్‌ నుంచి మున్సిపల్‌ కార్యాలయానికి పంట పొలాల నుంచి వెళ్లే రహదారిలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మృతులను తణుకు మున్సిపల్‌ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేసే శేఖర్‌, ఆర్టీఓ కార్యాలయంలో వాటర్ బాయ్‌గా పని చేసే కటారి శ్రీనివాస్ రావు, ఉండ్రాజవరం మండలం వెలుగుశాఖలో సీసీగా పని చేస్తున్ననాగ సుభాషిణిగా గుర్తించారు.

భీమవరం నుంచి విధులకు హాజరయ్యేందుకు వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. కారు నీటిలో బోల్తా కొట్టడంతో ముగ్గురు అందులోనే ఊపిరాడక మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని, ఘటనకు గల పూర్తి కారణాలను తరువాత వెల్లడిస్తామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
logo