శుక్రవారం 05 జూన్ 2020
Crime - Mar 02, 2020 , 09:38:30

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

 రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

కీసర :  మద్యం మత్తు.. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలను గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన  కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..  కీసర మండల కేంద్రానికి అనుబంధ గ్రామమైన వన్నెగూడ నివాసి వికలాంగుడు మంత్రాల నర్సింహ(40) కీసరగుట్ట ఆలయంలో ఆటెండర్‌. భార్య ఇద్దరు కుమారులున్నారు. అదే గ్రామానికి చెందిన రాయపురం కిష్టయ్య (55)కు భార్య ముగ్గురు కుమారులు, ఒక్క కుమార్తె ఉన్నారు. ఆదివారం సాయంత్రం మంత్రాల నర్సింహ, రాయపురం కిష్టయ్య  బైక్‌పై భోగారం నుంచి కీసర వైపు వెళుతున్నారు.  భోగారం గ్రామానికి చెందిన దుర్గం వెంకటేశ్‌  మద్యం మత్తులో కీసర నుంచి భోగారానికి కారులో వస్తున్నాడు. అతివేగంతో బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో నర్సింహ, కిష్టయ్య అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు కుటుంబీకులు, పోలీసులకు సమాచామిచ్చారు. పోలీసులు  మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించి కేసు దర్మాప్తు చేస్తున్నారు. దీంతో ఇరుకుటుంబాల్లో విషాధ చాయలు అలుముకున్నాయి.  

రోడ్డు దాటుతూ ఒకరు..

శామీర్‌పేట : శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. ఒడిశా, గజపతి జిల్లాకు చెందిన బాలకృష్ణ, లక్ష్మి కుటుంబ సభ్యులతో కోంపల్లిలో నివాసముంటున్నారు. కాగా, ఆదివారం ఉదయం  కోంపల్లి నుంచి తుర్కపల్లి గ్రామం వెళ్లేందుకు  బస్సు ఎక్కి.. తుర్కపల్లి వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతున్న క్రమంలో సిద్దిపేట నుంచి హైదారబాద్‌ వైపు వెళ్తున్న  కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలకృష్ణ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైభాస్కర్‌ వివరించారు.


logo