ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Aug 30, 2020 , 17:30:04

భారీ వర్షాలకు ఇల్లు కూలి ముగ్గురు చిన్నారులు మృతి

భారీ వర్షాలకు ఇల్లు కూలి ముగ్గురు చిన్నారులు మృతి

చిత్రకూట్ : భారీ వర్షాలకు ఇల్లు కూలడంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతిచెందిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టం చిత్రకూట్ జిల్లాలోని రాయ్‌పురా ప్రాంతంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాయ్‌పురాకు చెందిన అశోక్‌వర్మ శిథిలావస్థకు చెందిన ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గత మూడు రోజులుగా ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆదివారం ఇల్లు కుప్పకూలి, శిథిలాలు అశోక్‌ కుమార్తెలు రీతు (12), శివదేవి (9), పూజ (5)లపై పడ్డాయి. గమనించిన స్థానికులు శిథిలాలను తొలగించి చూడగా అప్పటికే ముగ్గురు చిన్నారులు మృతి చెంది ఉన్నారు. 

ఒకే ఇంటికి చెందిన ముగ్గురు ఆడపిల్లలు ప్రమాదంలో మరణించడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాలను స్థానిక తహసీల్దార్‌ రాజ్‌బహదూర్‌ సందర్శించి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కూలడంతో

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo