సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Aug 21, 2020 , 19:18:46

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్టు

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్టు

మెయిన్‌పురి : గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) సిబ్బంది, మెయిన్‌పురి పోలీసుల సంయుక్తంగా అరెస్టు చేసి 213 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మెయిన్పురిలో కొందరు స్థావరం ఏర్పాటు చేసుకొని గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వీరు ఎస్టీఎఫ్ సిబ్బంది సహకారంతో స్థావరంపై దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులను నివాస్ విశ్వస్, మహేంద్ర సింగ్, రాకేశ్ గౌర్‌గా గుర్తించారు. వీరి నుంచి రూ .12 లక్షల విలువైన గంజాయి ట్రక్, కారు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాలు, మానసికంగా ప్రభావం చూపే పదార్థాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo