సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jul 31, 2020 , 17:10:53

జింక కొమ్ములు విక్రయిస్తున్న ముగ్గురు అరెస్టు

జింక కొమ్ములు విక్రయిస్తున్న ముగ్గురు అరెస్టు

బెంగళూరు : జింక కొమ్ములను విక్రయించడానికి ప్రయత్నించిన ముగ్గురు మధ్యవర్తులను శుక్రవారం బెంగళూరులో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నగరానికి చెందిన సుందరేశ్‌, మంజునాథ్‌, రాఘవేంద్రలు కస్టమర్లను ఆకర్శించడానికి జింక కొమ్ముల భాగాలను నీటితో తీసుకుంటే కొన్ని రకాల వ్యాధులు నయమవుతాయని, వీటిని ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం వరిస్తుందని ఒక వీడియో తయారు చేశారు. ఈ వీడియో అందరికీ చూపిస్తూ కొమ్ములను యశ్వంత్‌పూర్ ప్రాంతంలో విక్రయించడానికి ప్రయత్నం చేస్తుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) కుల్దీప్ జైన్ తెలిపారు. 

ఈ ముగ్గురిపై వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను అటవీశాఖకు అప్పగించామని, జింక కొమ్ములను నిందితులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. రెండు జింక కొమ్ములను స్వాధీనం చేసుకున్నామని, ఇవి సుమారు 2కిలోలు ఉండగా, వీటి విలువ రూ.5లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నేరస్తుల నుంచి టయోటా ఇన్నోవా, మూడు మొబైల్ ఫోన్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo