మంగళవారం 26 జనవరి 2021
Crime - Oct 22, 2020 , 13:25:58

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్‌

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్‌

హైదరాబాద్‌ : నగరంలో ఐపీఎల్‌ క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముగ్గురుని సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని 73 వేల రూపాయల నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పొలీసుల కథనం మేరకు.. క్రికెట్‌ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి సయ్యద్ ఖాసీం ఉల్ హఖ్, గులాం హసన్ ఖాన్, ఆరీఫ్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ నిర్వహించే ప్రధాన నిందితుడు హర్ష్, కలెక్షన్ ఏజెంట్ సయ్యద్ వఖార్ పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులను తదుపరి విచారణ కోసం మీర్‌చౌక్ పొలీసులకు అప్పగించారు.


logo