శుక్రవారం 23 అక్టోబర్ 2020
Crime - Sep 19, 2020 , 20:36:19

ఆటోని దొంగిలించిన ముగ్గురి అరెస్టు

ఆటోని దొంగిలించిన ముగ్గురి అరెస్టు

హైద‌రాబాద్ : ఆటోని దొంగిలించిన ముగ్గురిని న‌గ‌రంలోని చ‌త్రినాక పోలీసులు శ‌నివారం అరెస్టు చేశారు. నిందితుల వ‌ద్ద నుంచి ఆటోను, ఓ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వ్యక్తుల‌ను షేక్ మ‌క్బూల్‌(35), అబ్దుల్ లాయ‌క్‌(30), మొహ‌మ్మ‌ద్ షాజ‌ద్ షేక్‌(42)గా గుర్తించారు. నిందితులంతా తాల‌బ్‌క‌ట్ట నివాసితులు. ఈ ముగ్గురు ఆటోను అద్దెకు కిరాయికి మాట్లాడుకుని నెక్లెస్‌రోడ్‌కు వెళ్లారు. అక్క‌డ ఆటో డ్రైవ‌ర్‌పై దాడిచేసి అత‌న్ని బ‌య‌ట‌కు లాగి ఆటోతో స‌హా ప‌రార‌య్యారు. బాధితుడు ఫిర్యాదు మేర‌కు పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టి నిందితుల‌ను అరెస్టు చేశారు. 


logo