బుధవారం 20 జనవరి 2021
Crime - Dec 21, 2020 , 14:36:39

రోడ్డుప్ర‌మాదంలో ముగ్గురు సైనికులు మృతి

రోడ్డుప్ర‌మాదంలో ముగ్గురు సైనికులు మృతి

గ్యాంగ్‌ట‌క్ : ‌సిక్కింలోని నాథులా వ‌ద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ రోడ్డులో 17వ మైలు వ‌ద్ద ఆర్మీ సైనికులు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు సైనికులు స‌హా ఆర్మీ క‌ల్న‌ల్ కుమారుడు(13) ప్రాణాలు కోల్పోయారు. మ‌రో జ‌వాన్ తీవ్రంగా గాయ‌ప‌డ‌టంతో చికిత్స నిమిత్తం కోల్‌క‌తాకు త‌ర‌లించారు. ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకున్న పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టి, మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ద‌ట్ట‌మైన పొగ‌మంచు కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు.  


logo