ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Sep 11, 2020 , 20:29:55

తుపాకులతో బెదిరించి బంగారం షాపులో నగలు దోపిడీ

తుపాకులతో బెదిరించి బంగారం షాపులో నగలు దోపిడీ

లక్నో: ముఖానికి మాస్కులు ధరించి బంగారం షాపులోకి వచ్చిన ముగ్గురు యువకులు కౌంటర్ లోని సిబ్బందిని తుపాకులతో బెదిరించి నగలు దోపిడీ చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు జ్యుయలరీ షాపులోకి ప్రవేశించారు. అనంతరం తుపాకులు చూపి అక్కడున్న వారిని బెదిరించారు. బంగారం ఆభరణాలు ఉన్న ట్రేల నుంచి వాటిని తీసుకుని తమ వద్ద ఉన్న బ్యాగులో వేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కొందరు వినియోగదారులు కూడా అక్కడ ఉన్నప్పటికీ భయంతో ఎవరూ వారిని ఎదుర్కోలేకపోయారు. ఈ ఘటనపై జ్యుయలరీ షాపు యజమాని ఫిర్యాదు చేశారు. సుమారు రూ.40 వేల విలువైన బంగారం ఆభరణాలను వారు దోచుకున్నట్లు ఆరోపించారు. ఈ దోపిడీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అలీగఢ్ ఎస్పీ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించి త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. కాగా ఈ దోపిడీకి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo