గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Aug 10, 2020 , 15:04:38

చంపేస్తాం, రేప్‌ చేస్తామని బెదిరిస్తున్నారు : షమీ మాజీ భార్య జహాన్‌

చంపేస్తాం, రేప్‌ చేస్తామని బెదిరిస్తున్నారు : షమీ మాజీ భార్య జహాన్‌

కోల్‌కతా : ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిన సందర్భంగా హిందూ సోదరులు, సోదరీమణులకు సోష్‌ల్‌ మీడియాలో అభినందనలు తెలిపినందుకు.. తనను కొంతమంది బెదిరిస్తున్నారని క్రికెటర్‌ మహమ్మద్‌ షమీ మాజీ భార్య హసిన్ జహాన్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

జహాన్ కోల్‌కతాలోని సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. ఫిర్యాదులో ఆమె తెలిపిన వివరాలు.. ఆగస్టు 5న అయోధ్యలో రామ్ మందిర నిర్మాణానికి పునాది రాయి పడడంతో హసిన్‌ జహాన్‌ హిందువులకు అభినందనలు తెలిపింది. ఆ తరువాత సోషల్‌ మీడియాలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను వేధింపులకు గురి చేస్తున్నారని, ప్రాణాలు తీస్తామని, రేప్‌ చేస్తామని బెదిరిస్తున్నట్లు ఆమె తెలిపింది. సోషల్ మీడియా ద్వారా నిరంతరం ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొంది. తనకు సహాయం చేయాలని, ఆకతాయిల వేధింపుల నుంచి తనను కాపాడాలని ఆమె పోలీసులను కోరింది. తాను తన కుమార్తెతో ఒంటరిగా నివసిస్తుండడం వల్ల ప్రతీ నిమిషం భయం భయంగా గడుపుతున్నానని ఆమె ఫిర్యాదులో తెలిపింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె అభ్యర్థించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo