మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 19, 2020 , 12:07:00

సుశాంత్ ఫ్యామిలీ విక్ట‌రీ ఇది : లాయ‌ర్ వికాస్ సింగ్‌

సుశాంత్ ఫ్యామిలీ విక్ట‌రీ ఇది :  లాయ‌ర్ వికాస్ సింగ్‌

హైద‌రాబాద్‌: సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ మృతి కేసులో సీబీఐ విచార‌ణ‌కు సుప్రీంకోర్టు ఆదేశించ‌డం ప‌ట్ల లాయ‌ర్ వికాస్ సింగ్ స్పందించారు.  ఇది సుశాంత్ రాజ్‌పుత్ ఫ్యామిలీ విజ‌య‌మ‌ని ఆయ‌న అన్నారు.  అన్ని అంశాల్లోనూ సుప్రీంకోర్టు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చిన‌ట్లు వికాస్ తెలిపారు.  పాట్నాలో ఎఫ్ఐఆర్ న‌మోదు కావ‌డం కూడా క‌రెక్ట్ అన్న విష‌యాన్ని కోర్టు ప్ర‌స్తావించిన‌ట్లు లాయ‌ర్ వికాస్ చెప్పారు.  సుశాంత్ కేసులో మ‌రేదైనా ఎఫ్ఐఆర్ న‌మోదు అయినా, దాన్ని కూడా సీబీఐ విచారించాల‌ని కోర్టు ఆదేశించిన ఆయ‌న తెలిపారు. వీలైనంత త్వ‌ర‌గా న్యాయం జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు.  సుశాంత్ మృతి కేసులో అత‌ని తండ్రి కృష్ణ కుమార్ త‌ర‌పున లాయ‌ర్ వికాస్ వాదిస్తున్నారు. logo