e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News కేపీహెచ్‌బీ కాల‌నీ ఆల‌యంలో చోరీ..

కేపీహెచ్‌బీ కాల‌నీ ఆల‌యంలో చోరీ..

కేపీహెచ్‌బీ కాల‌నీ ఆల‌యంలో చోరీ..

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని కేపీహెచ్‌బీ కాల‌నీలో గ‌ల ఓ ఆల‌యంలో మంగ‌ళ‌వారం ఉద‌యం చోరీ జ‌రిగింది. తెల్ల‌వారుజామున ఆల‌యంలోని ప్ర‌వేశించిన దొంగ‌లు హుండీలోని న‌గ‌దు, 11 కిలోల వెండి ఆభ‌ర‌ణాలు, ఇత‌ర విలువైన వ‌స్తువుల‌ను అప‌హ‌రించుకుపోయారు. ఆల‌య ప్రాంగ‌ణంలో ఉన్న సీసీటీవీ కెమెరాల వైర్ల‌ను నిందితులు డిస్‌క‌నెక్ట్ చేశారు.

కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. తెల్ల‌వారుజామున 3 గంట‌ల ప్రాంతంలో చోరీ జ‌రిగి ఉండొచ్చ‌న్నారు. దుండుగులు ఆల‌యంలోకి ప్ర‌వేశించి హుండీలోని న‌గదుతో పాటు గ‌ర్భ‌గుడిలో వెండి ఆభ‌ర‌ణాలు అప‌హ‌రించుకుపోయారు. ఆలయ అధికారులు ఉద‌యం గ‌మ‌నించి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఇది స్థానిక ముఠా ప‌ని అయి ఉంటుంద‌ని తాము అనుమానిస్తున్నామ‌న్నారు. ఆల‌య అధికారుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కేపీహెచ్‌బీ కాల‌నీ ఆల‌యంలో చోరీ..

ట్రెండింగ్‌

Advertisement