శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jun 19, 2020 , 17:00:40

క‌రోనా రోగి సెల్ ఫోన్ దొంగిలింత‌.. దొంగ‌కు క‌రోనా ప‌రీక్ష‌లు

క‌రోనా రోగి సెల్ ఫోన్ దొంగిలింత‌.. దొంగ‌కు క‌రోనా ప‌రీక్ష‌లు

గువ‌హ‌టి : క‌రోనా రోగులు చికిత్స పొందుతున్న ఆస్ప‌త్రుల వ‌ద్ద‌కు వెళ్లాలంటేనే వ‌ణుకు పుడుతోంది. అలాంటిది ఆ వైర‌స్ కు ఓ దొంగ భ‌య‌ప‌డ‌లేదు. ద‌ర్జాగా ఐసోలేష‌న్ వార్డులోకి వెళ్లి.. క‌రోనా రోగి సెల్ ఫోన్ ను దొంగ‌త‌నం చేశాడు. ఈ ఘ‌ట‌న అసోంలోని చిరాంగ్ జిల్లాలోని జేఎస్ఎస్బీ సివిల్ హాస్పిట‌ల్ లో సోమ‌వారం రాత్రి చోటు చేసుకుంది. 

ప‌ప్పు బుర్మాన్(22) అనే దొంగ‌.. ఆస్ప‌త్రిలోని ఐసోలేషన్ వార్డులోకి సోమ‌వారం రాత్రి ఒంటి గంట స‌మ‌యంలో వెళ్లాడు. క‌రోనా రోగి వ‌ద్ద ఉన్న సెల్ ఫోన్ ను సెలైంట్ గా దొంగిలించాడు. ఉద‌యాన్నే లేచిన రోగి.. తన ఫోన్ క‌నిపించ‌డం లేద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. 

కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆస్ప‌త్రి వ‌ద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ త‌ర్వాత అత‌ని ర‌క్త న‌మూనాల‌ను సేక‌రించి క‌రోనా టెస్టుల‌కు పంపించారు. ప్ర‌స్తుతానికి అత‌న్ని ఆస్ప‌త్రి క్వారంటైన్ లో ఉంచారు. ఇప్పుడు ఆ ఫోన్ ను ఎవ‌రెవ‌రు ముట్టుకున్నార‌నేది తేలాల్సి ఉంది. 

క‌రోనా వార్డులోకి వెళ్లేందుకు ఎవ‌రూ సాహ‌సం చేయ‌డం లేదు. దొంగ ఆ వార్డులోకి వెళ్ల‌డం షాక్ గా ఉంద‌ని డాక్ట‌ర్లు, పోలీసులు అన్నారు. బుర్మాన్ పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు స్ఫ‌స్టం చేశారు. ఈ నేప‌థ్యంలో ఆస్ప‌త్రి వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. 


logo