జగిత్యాల : ఓ దొంగ జగిత్యాల పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. దొంగతనం కేసులో రెండు రోజులక్రితం ఇర్ఫాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఇవాళ ఉదయం వాష్‌రూమ్‌కు వెళ్తానని చెప్పడంతో సిబ్బంది లాకప్ నుంచి బయటకు అనుమతించారు. కాగా వాష్‌రూమ్‌కు అని వెళ్లిన అతడు పరిసరాల గమనం అనంతరం అక్కడి గోడ దూకి పారిపోయాడు. ఈ సంఘటనతో షాక్‌కు గురైన పోలీసులు ఇర్ఫాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.