e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News గోల్డ్ షాపులో చోరీ.. గ‌జ‌దొంగ బిర్యానీ అరెస్ట్

గోల్డ్ షాపులో చోరీ.. గ‌జ‌దొంగ బిర్యానీ అరెస్ట్

గోల్డ్ షాపులో చోరీ.. గ‌జ‌దొంగ బిర్యానీ అరెస్ట్

హైద‌రాబాద్ : లింగంప‌ల్లిలోని ఓ గోల్డ్ షాపులో చోరీ జ‌రిగిన విష‌యం విదిత‌మే. ఈ చోరీకి పాల్ప‌డిన దొంగ‌ను చందాన‌గ‌ర్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగ నుంచి మూడున్న‌ర తులాల బంగారం, 10 కిలోల వెండి ఆభ‌ర‌ణాలు, నాలుగు కార్లతో పాటు రూ. 35 వేల న‌గదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని మీడియా ఎదుట ప్ర‌వేశ‌పెట్టారు.

ఈ సంద‌ర్భంగా మాదాపూర్ డీసీపీ వెంక‌టేశ్వ‌ర్ రావు మీడియాతో మాట్లాడారు. చందాన‌గ‌ర్‌, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా ఈ కేసును చేధించారు అని పేర్కొన్నారు. పేరు మోసిన గ‌జ‌దొంగ స‌య్య‌ద్ మ‌హ‌మ్మ‌ద్ పాషా అలియాస్ బిర్యానీ పాషాను అరెస్టు చేశామ‌ని తెలిపారు. బిర్యానీ పాషా 2010 నుంచి దొంగ‌త‌నాలు పాల్ప‌డుతున్నాడు. ఇప్ప‌టికే 15 కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడ‌ని చెప్పారు. ఈ దొంగ‌పై పీడియాక్ట్ కూడా న‌మోదు చేసిన‌ట్లు పేర్కొన్నారు. 2019లో జైలు నుంచి విడుద‌ల‌య్యాక‌.. న‌ల్ల‌గొండ‌, హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్ ప‌రిధిలో 13 చోరీలు చేశాడ‌ని తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గోల్డ్ షాపులో చోరీ.. గ‌జ‌దొంగ బిర్యానీ అరెస్ట్

ట్రెండింగ్‌

Advertisement