బుధవారం 20 జనవరి 2021
Crime - Nov 13, 2020 , 15:49:47

గజదొంగ అరెస్టు.. భారీగా బంగారం, వెండి స్వాధీనం

గజదొంగ అరెస్టు.. భారీగా బంగారం, వెండి స్వాధీనం

హైదరాబాద్‌ : దృష్టి మరల్చి చోరీలు చేస్తున్న గజదొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఆఫ్తాబ్‌ అనే దొంగను నగరంలోని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నేడు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.18.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్తాబ్‌పై తెలంగాణ, మహారాష్ట్రల్లో పలు కేసులు నమోదైనట్లు సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు.logo