సోమవారం 25 జనవరి 2021
Crime - Oct 11, 2020 , 14:36:54

ఆలయంలో చోరీ.. బంగారం, వెండి వస్తువుల అపహరణ

ఆలయంలో చోరీ.. బంగారం, వెండి వస్తువుల అపహరణ

యాదాద్రి : యాదాద్రి మండలం యాదగిరిపల్లి గ్రామంలోని హాయగ్రీవస్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి దుండగులు ఆలయం తాళాలు తెరిచి అమ్మవారి మెడలోని పుస్తెలతాడు, కిలోన్నర వెండి వస్తువులు అపహరించారు. ఉదయం నిత్యపూజలు చేసేందుకు ఆలయానికి అర్చకుడు రావడంతో తలుపులు తెరిచి ఉన్నాయి. గర్భగుడిలోకి వెళ్లి చూడగా అమ్మవారి పుస్తెలతాడు, వెండి వస్తువులు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. క్లూస్‌టీం, డాగ్‌స్కాడ్‌ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించాయి. ఆలయ సమీపంలో నివాసముండే వారిని పోలీసులు విచారించి వివరాలు నమోదు చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo