శుక్రవారం 04 డిసెంబర్ 2020
Crime - Oct 27, 2020 , 11:57:04

శంషాబాద్‌లో భారీ చోరీ..

శంషాబాద్‌లో భారీ చోరీ..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసు స్టేష‌న్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీలో సోమ‌వారం రాత్రి భారీ చోరీ జ‌రిగింది. తాళం వేసిన ఉన్న‌ ఇంట్లోకి దొంగలు చొర‌బ‌డ్డారు. ఆ ఇంట్లో నుంచి 30 తులాల బంగారంతో పాటు రూ. 15 వేల న‌గ‌దును దొంగ‌లు ఎత్తుకెళ్లారు. ఊట్‌ప‌ల్లిలో 10 తులాల బంగారాన్ని అప‌హ‌రించారు. ఈ రెండు చోరీల‌పై బాధిత కుటుంబాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాయి. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. చోరీ జ‌రిగిన నివాసాల‌ను ప‌రిశీలించారు. ఆధారాల కోసం డాగ్ స్క్వాడ్‌, క్లూస్ టీమ్‌తో ద‌ర్యాప్తు చేస్తున్నారు.