గురువారం 02 జూలై 2020
Crime - Apr 30, 2020 , 20:12:38

తార్నాక గుడ్‌ల్యాండ్స్‌లో మద్యం చోరీ

తార్నాక గుడ్‌ల్యాండ్స్‌లో మద్యం చోరీ

హైదరాబాద్‌ : నగరంలోని తార్నాక చౌరస్తాలో ఉన్న గుడ్‌ల్యాండ్స్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో మద్యం చోరీ ఘటన చోటుచేసుకుంది. తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు వివిధ బ్రాండ్స్‌కు సంబంధించిన 170 మద్యం ఫుల్‌ బాటిల్స్‌ను అపహరించుకుపోయారు. సీసీ టీవీ కెమెరాకు చిక్కకుండా దానిపై ఓ టవల్‌ను కప్పారు. బార్‌ మిద్దెపై ఉన్న మొక్కలకు నీళ్లు పోసేందుకు యజమాని నేడు బార్‌కు వచ్చాడు. అనుమానం రావడంతో షట్టర్లు తెరిచి చూశాడు. మద్యం చోరీకి గురైనట్లుగా గుర్తించాడు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.


logo