ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Aug 29, 2020 , 21:52:23

ఏడేళ్ల క్రితం తండ్రి... ఇప్పుడు ఈత‌కు వెళ్లి కొడుకు మృతి

ఏడేళ్ల క్రితం తండ్రి... ఇప్పుడు ఈత‌కు వెళ్లి కొడుకు మృతి

ఖ‌మ్మం : స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు నీటి మునిగి చ‌నిపోయాడు. ఈ విషాద సంఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లా కొత్త‌గూడెం మండ‌లం సింగ‌భూపాలెం గ్రామంలో శ‌నివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సింగభూపాలెం గ్రామానికి చెందిన గొర్రె శ్రీను, హేమలత దంప‌తుల‌ కుమారుడు ప్రభాస్ (15). ఇత‌డు 9 వ తరగతి చదువుతున్నాడు. న‌లుగురి స్నేహితులతో కలిసి సింగభూపాలెం అలుగు వైపు ఈతకు వెళ్లాడు. ఈత సరిగా రాకపోవడంతో నీటి మునుగుతూ స్నేహితులను పిలిచాడు. తోటి స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం దక్కలేదు. బాలుడు మృతితో  గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా ప్రభాస్ తండ్రి శ్రీను సైతం గత ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. 


logo