మంగళవారం 26 జనవరి 2021
Crime - Oct 12, 2020 , 19:37:08

పెళ్లి కుదరడం లేదని యువకుడు ఆత్మహత్య

పెళ్లి కుదరడం లేదని యువకుడు ఆత్మహత్య

కరీంనగర్‌ : పెళ్లి కుదరడం లేదన్న మనోవేదనలో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌ జిల్లా గోదావరిఖని సప్తగిరికాలనీలో సోమవారం ఈ ఘటన జరిగింది. సప్తగిరి కాలనీకి చెందిన నస్ఫురి సురేశ్‌(26) ప్రైవేట్‌ ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. పెళ్లి సంబంధాలు చూస్తున్నా వివాహానికి ఎవ్వరూ ముందుకు రావడంలేదని మనోవేదనలో ఉన్నాడు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి గోడు వెళ్లబోసుకున్నాడు. అనంతరం తన గదిలోకి వెళ్లి అర్ధరాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండ్రి వెంకటి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo