శుక్రవారం 03 జూలై 2020
Crime - Jan 31, 2020 , 22:41:18

విజయవాడలో దారుణం.. మహిళ గొంతుకోసి బంగారం చోరీ

విజయవాడలో దారుణం.. మహిళ గొంతుకోసి బంగారం చోరీ

విజయవాడ: దొంగల ఆగడాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోయింది. మనిషి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారికి కావాల్సింది ఎలాగైనా లాక్కెల్లడమే ధ్యేయంగా దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, విజయవాడలోని భవానిపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ గొంతు కోసి చంపి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకొని పరారయ్యారు. అక్కడ తమ ఆనవాళ్లు దొరకకుండా కారంపొడి చల్లి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్‌టీంతో రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలోని సీసీటీవి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మృతురాలు యేదుపాటి పద్మావతిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ముమ్మరం చేశారు. 


logo